నిమ్జ్ ప్రాజెక్ట్ భూముల చుట్టూ ఫెన్సింగ్ చర్యలు
SRD: న్యాల్కల్, ఝరాసంగం మండలాల పరిధిలో నిమ్జ్ ప్రాజెక్ట్ కోసం సేకరించిన 3245 ఎకరాల భూములను ఇవాళ అధికారులు స్వాధీనం చేసుకుంటున్నారు. న్యాల్కల్ రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ శ్యామ్ రావు పాటిల్ అధికారుల బృందం భూముల్లో పర్యటించారు. భూముల చుట్టూ ఫెన్సింగ్ వేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఈ మేరకు జేసీబీ యంత్రం ద్వారా చెట్లు పొదలు, కొమ్మలు తొలగించారు.