ఆలయాల్లో హుండీల చోరీ

VZM: పూసపాటిరేగ మండలం కనిమెల్ల గ్రామంలో ఉన్న మూడు ఆలయాల్లో హుండీల చోరీ జరిగినట్లు ఎస్సై ఐ. దుర్గా ప్రసాద్ శుక్రవారం తెలిపారు. ఎస్సై తెలిపిన వివరాల మేరకు గురువారం రాత్రి దొంగతనానికి పాల్పడినట్లు చెప్పారు. ఇంతలో అటువైపుగా వెళ్తున్న చింతపల్లి నాగరాజును చూసి దొంగలు హూండిని వదిలి పారిపోయినట్లు తెలిపారు. గ్రామస్తులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామన్నారు.