డీఎస్పీ కార్యాలయంలో కమాండ్ కంట్రోల్ రూమ్ ప్రారంభం

డీఎస్పీ కార్యాలయంలో కమాండ్ కంట్రోల్ రూమ్ ప్రారంభం

KDP: మైదుకూరు డీఎస్పీ కార్యాలయంలో నూతనంగా ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ రూమ్‌ను గురువారం ఎమ్మెల్యే సుధాకర్ యాదవ్, కర్నూలు డీఐజీ కోయ ప్రవీణ్, జిల్లా ఎస్పీ విశ్వనాథ్ నచికేత్ ప్రారంభించారు. ఈ సందర్భంగా డీఐజీ మాట్లాడుతూ.. కమాండ్ కంట్రోల్ రూమ్ ద్వారా నేరాల నియంత్రణను మరింత సమర్థవంతంగా చేపట్టవచ్చని, ఇది శాంతి భద్రతల పరిరక్షణకు ఉపయోగపడుతుందని తెలిపారు.