రైల్వే స్టేషన్‌లో గోడను ఢీకొన్న గూడ్స్ రైల్

రైల్వే స్టేషన్‌లో గోడను ఢీకొన్న గూడ్స్ రైల్

WGL: నగరంలో రైల్వే స్టేషన్‌లో గురువారం ప్రమాదం సంభవించింది. వరంగల్ రైల్వే స్టేషన్‌లో ఓ గూడ్స్ రైలు రివర్స్ వస్తూ రైల్వే స్టేషన్ ముందున్న ఏటీఎం పక్కన ఉన్న గోడకు తగిలింది. ఈ ఘటనలో గోడ ధ్వంసం కాగా, ఎవరికీ ఎటువంటి ప్రమాదం జరగలేదు. దీంతో రైల్వే అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.