గుండె సంబంధిత వ్యాధులపై కార్మికులకు అవగాహన కార్యక్రమం
BHPL: సింగరేణి ఏరియాలోని కేటీకె 5వ ఇంక్లైన్‌లో బుధవారం సింగరేణి కార్మికులకు, ఉద్యోగులకు గుండె సంబంధిత వ్యాధులు, గుండె పోటుపై అవగాహన కార్యక్రమం నిర్వహించగా వైద్యాధికారి డాక్టర్ పద్మ పాల్గొని అవగాహన కల్పించారు. వారు మాట్లాడుతూ.. గుండె జబ్బులు, గుండెపోటు కారణాలు, లక్షణాలు, నివారణ చర్యలు, జీవన శైలిలో మార్పులు ద్వారా వాటిని ఎలా నివారించాలో వివరించారు.