CMRF చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే
MDK: నర్సాపూర్ నియోజకవర్గంలోని వివిధ మండలాలకు చెందిన 146 మంది లబ్ధిదారులకు శనివారం CMRF చెక్కులను అందజేశారు. ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి తన నివాసంలో మొత్తం రూ.36 లక్షల విలువైన చెక్కులను పంపిణీ చేశారు. ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్స పొందిన పేదలకు ఈ సాయం ఎంతో ఉపశమనం కలిగిస్తుందని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.