నేడు ఐబొమ్మ రవి కస్టడీ పిటిషన్‌పై విచారణ

నేడు ఐబొమ్మ రవి కస్టడీ పిటిషన్‌పై విచారణ

TG: ఐబొమ్మ రవి కస్టడీ పిటిషన్‌పై ఇవాళ కోర్టులో విచారణ జరగనుంది. రవిని 7 రోజుల కస్టడీకి కోరుతూ పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. అతన్ని తమ కస్టడీకి ఇస్తే లోతుగా విచారణ జరిపి మరిన్ని వివరాలను సేకరిస్తామన్నారు. కాగా కొత్త సినిమాను పైరసీ చేసి వాటిని ఐబొమ్మ, బప్పం టీవీ సైట్లలో అప్‌లోడ్ చేయడంతో రవిని పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.