VIDEO: మేడారంలో ట్రాఫిక్ జామ్.. ఇబ్బందులు పడ్డ భక్తులు
ములుగు జిల్లా మేడారం సమ్మక్క–సారలమ్మ వనదేవతలకు ముందస్తు మొక్కులు చెల్లించేందుకు పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తున్నారు. ఈ క్రమంలో సోమవారం సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రివర్గం మేడారంలో ఉండటంతో భద్రతా ఏర్పాట్లు పెరగడంతో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.దీంతో దర్శనానికి వెళ్లే భక్తులు గంటల తరబడి ట్రాఫిక్‌లో ఇరుక్కొని తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.