అగ్నిప్రమాదంలో మొక్కజొన్న పంట దగ్ధం

అగ్నిప్రమాదంలో మొక్కజొన్న పంట దగ్ధం

కృష్ణా: కంచికచర్ల మండలం మున్నలూరులోని కృష్ణానది లంక పొలాలలో మొక్కజొన్న చొప్పకు మంగళవారం ఓ రైతు నిప్పు పెట్టడంతో అగ్నిప్రమాదం సంభవించింది. వేసవి, గాలులు వీయడంతో క్షణాల్లో ఆ పొలం చుట్టుపక్కల ఉన్న సుమారు పది ఎకరాలకు నిప్పంటు కొని 60 స్ప్రింకర్లు, సోలార్ పంప్, విద్యుత్ పరికరాలు దగ్ధమయ్యాయి. దీంతో సుమారు రూ. 8లక్షల నష్టం వాటిల్లిందని బాధితులు వాపోతున్నారు.