'తుఫాన్ బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుంది'
SKLM: తుఫాన్ బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్ అన్నారు. మంగళవారం ఆమదాలవలస మండలం శ్రీనివాసాచార్యుల పేటలో తుఫాన్ వల్ల నష్టపోయిన బాధితులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. అనంతరం స్థానిక గ్రామస్తులతో మాట్లాడే గ్రామంలో ఉండే సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఎంపీడీవో వెంకటరావు, ఎమ్మార్వో రాంబాబు, అధికారులు పాల్గొన్నారు.