వెంకటేశ్వర్లు మృతి బాధాకరం: మాజీ ఎమ్మెల్యే
SRPT: కోదాడ మండలం దోరకుంట గ్రామానికి చెందిన మాజీ సింగిల్ విండో ఛైర్మన్ వెంకటేశ్వర్లు బుధవారం అనారోగ్యంతో మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ మృతదేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులు పరామర్శించారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట మండల బీఆర్ఎస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.