తప్పించుకు తిరుగుతున్న ఇద్దరు నిందితులు అరెస్ట్
MNCL: కోర్టు వాయిదాలకు హాజరుకాకుండా తప్పించుకు తిరుగుతున్న ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసినట్లు కోటపల్లి ఎస్సై రాజశేఖర్ తెలిపారు. గత ఏడాది ఒక కేసులో నిందితులుగా ఉన్న కారడ కుమార్ అలియాస్ కొమురయ్య, కారడ బాపు కోర్టు వాయిదాలకు హాజరుకాకుండా తప్పించుకు తిరుగుతున్నారని పేర్కొన్నారు. సోమవారం వారిని పట్టుకుని కోర్టులో హాజరుపరచగా రిమాండ్ విధించిందన్నారు.