గిద్దలూరులో అగ్నిమాపక వారోత్సవాలు

గిద్దలూరులో అగ్నిమాపక వారోత్సవాలు

ప్రకాశం: గిద్దలూరులోని ఇండేన్ గ్యాస్ గోడౌన్, పెట్రోల్ బంకులు తదితర ప్రాంతాల్లో శనివారం అగ్నిమాపకశాఖ అధికారులు అగ్ని ప్రమాదం సంభవించినప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తలను గురించి ప్రజలకు అవగాహన కల్పించారు. అగ్నిప్రమాదాల నివారణ, ఫైర్ సేఫ్టీ పరికరాల వినియోగాన్ని డెమో ద్వారా తెలిపారు. ఈ కార్యక్రమంలో అగ్నిమాపక శాఖ అధికారులు పాల్గొన్నారు.