యాసంగి ధాన్యం కొనుగోళ్లపై కలెక్టర్ సమీక్ష

యాసంగి ధాన్యం కొనుగోళ్లపై కలెక్టర్ సమీక్ష

MBNR: యాసంగి (2025-26) ధాన్యం కొనుగోళ్లపై కలెక్టర్ ఖుష్బూ గుప్తా అధికారులకు దిశానిర్దేశం చేశారు. జిల్లాలో 173 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి, రైతులకు ఇబ్బంది లేకుండా పారదర్శకంగా సేకరించాలని సూచించారు. నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ, ధాన్యం సేకరించిన 3 రోజుల్లోనే రైతులకు చెల్లింపులు జరపాలని అధికారులను ఆదేశించారు.