కూలిబిడ్డ అద్భుత ప్రతిభ.. ఇంటర్‌లో 992 మార్కులు
MBNR: మూసాపేట మండల కేంద్రానికి చెందిన కూలీ రైతు చాంద్ పాషా, సబియా దంపతుల కుమారుడు ఎండి అశ్వక్ ఇంటర్ ఫలితాల్లో ఆణిముత్యంలా మెరిశాడు. ఎంపీసీ విభాగంలో 1000కి గాను 992 మార్కులు సాధించి అద్భుత ప్రతిభ కనబరిచాడు. తల్లిదండ్రుల కష్టాన్ని వృథా చేయకుండా, కష్టపడి చదివి అత్యుత్తమ మార్కులు సాధించిన అశ్వక్ను ఉపాధ్యాయులు, గ్రామస్థులు ఘనంగా అభినందించారు.