'పోలవరం ప్రాజెక్ట్ భూసేకరణ పూర్తి చెయ్యాలి'

ELR: పోలవరం ప్రాజెక్ట్ R&R పనుల భూసేకరణను వేగవంతం చేయాలని కలెక్టర్ వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు. బుట్టాయిగూడెం, జీలుగుమిల్లి మండలాల్లో అవసరమైన భూమిని గుర్తించాలన్నారు. రైతులతో గ్రామ సభలు నిర్వహించి, నిబంధనల ప్రకారం పరిహారం చెల్లించాలని సూచించారు. భూసేకరణ స్నేహపూర్వక వాతావరణంలో సాగు రైతులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చేలా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు.