రాజుపేటలో అక్రమ రేషన్ బియ్యం పట్టివేత
NTR: తిరువూరు మండలం రాజుపేటలో అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని అధికారులు పట్టుకున్నారు. పీడీఎస్ డీటీ కొంగర శ్వేత, వీఆర్‌వో సత్తార్ బుధవారం ముందస్తు సమాచారం మేరకు ఆకస్మిక దాడి నిర్వహించారు. బియ్యం లోడుతో వెళ్తున్న ఒక ఆటోను తనిఖీ చేయగా అందులో సుమారు 4.60 క్వింటాళ్ల రేషన్ బియ్యం అక్రమంగా తరలిస్తున్నట్లు గుర్తించారు. అనంతరం ఆటో డ్రైవర్‌ని పోలీసులు అరెస్ట్ చేశారు.