స్విగ్గీపై సీనియర్ నటి సుమలత సీరియస్!
ప్రముఖ నటి సుమలత స్విగ్గీ ఛార్జీల విధానాన్ని తన X ఖాతా వేదికగా ప్రశ్నించారు. 'నేను స్విగ్గీలో ఒక ఆర్డర్ పెట్టాను. అసలు ధర కంటే వారు రెట్టింపునకు పైగా ఛార్జ్ చేస్తున్నారు. ఇలా చేయడం సాధారణమేనా? ఇది అనుమతించదగినదేనా? నైతికమేనా? కేవలం రూ. 115 విలువైన ఐటెమ్‌కు నా వద్ద నుంచి రూ. 273 వసూలు చేశారు' అని రాసుకొచ్చారు. అయితే ఆమె ఆర్డర్ చేసింది పొంగల్ అని సమాచారం.