గ్యాస్ సిలిండర్ల కొరత లేదు: జాయింట్ కలెక్టర్
ATP: జిల్లాలో LPG సిలిండర్ల కొరత లేదని, వినియోగదారులు ఆందోళన చెందవద్దని జాయింట్ కలెక్టర్ విష్ణుచరణ్ వెల్లడించారు. సోషల్ మీడియాలో వస్తున్న వదంతులు నమ్మవద్దని కోరారు. రీఫిల్ బుకింగ్‌కు సంబంధించి గ్రామీణ ప్రాంతాల్లో 45 రోజులు, పట్టణాల్లో సింగిల్ సిలిండర్‌కు 25 రోజులు రోజుల కాలపరిమితి నిర్ణయించామని, సమస్యలుంటే 8500292992కు ఫిర్యాదు చేయాలని సూచించారు.