ఉచిత మట్టి వినాయక విగ్రహాలు పంపిణీ

ఉచిత మట్టి వినాయక విగ్రహాలు పంపిణీ

AKP: మాకవరపాలెం మండలం కొండల అగ్రహారం గ్రామంలో వినాయక చవితి సందర్భంగా ఉచితంగా మట్టి వినాయకుడి విగ్రహాలు మంగళవారం పంపిణీ చేశారు. ఎంపీపీ సర్వేశ్వరరావు మాట్లాడుతూ.. మట్టి వినాయకులను పూజించడం ద్వారా పర్యావరణానికి ఎటువంటి హాని జరగదన్నారు. కావున ప్రతి ఒక్కరూ మట్టి వినాయకుని పూజించాలని కోరారు. కార్యక్రమంలో మండల వైసీపీ అధ్యక్షులు చిటికెల రమణ పాల్గొన్నారు.