పింఛన్ డబ్బుల వివాదం…వృద్ధుడి ఆత్మహత్య

పింఛన్ డబ్బుల వివాదం…వృద్ధుడి ఆత్మహత్య

WGL: రాయపర్తి మండలం చక్రుతండాలో గుగులోతు జాదు (70) సోమవారం గడ్డి మందు తాగి మృతి చెందాడు. పింఛన్ డబ్బులపై భార్యాభర్తల మధ్య జరిగిన గొడవ తరువాత, మానసిక ఒత్తిడితో జాదు వారి బావి వద్దకు వెళ్లి ఈ క్రమంలో పురుగుల మందు తాగాడు. కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించినప్పటికీ అతను మృతిచెందాడు. మృతుడి కుమారుడు దేవిలాల్ ఫిర్యాదు మేరకు ఎస్సై రాజేందర్ కేసు నమోదు చేశారు.