నగరంలో క్షీణించిన గాలి నాణ్యత
HYD: మహానగరంలో కాలుష్యం పెరుగుతుండడంతో నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు ఇవాళ నగరంలోని నార్సింగిలో AQI 119గా నమోదైంది. దీనికి ప్రధాన కారణాలుగా వాహనాల పొగ, చెత్త దహనం ఎయిర్ పొల్యూషన్ అని అధికారులు గుర్తించారు. దీనికి తోడు సిటీలో కట్టెల పొయ్యిల వాడకంతో గాలి నాణ్యత మరింత క్షీణించిందని పేర్కొన్నారు. శ్వాసకోశ సమస్యలు వచ్చే ముప్పుందని, జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.