గంజాయి ముఠాను అరెస్టు చేయాలి: సీపీఎం
NDL: పెంచికలయ్యను హత్య చేసిన గంజాయి ముఠాను వెంటనే అరెస్టు చేయాలని సీపీఎం జిల్లా నాయకులు డిమాండ్ చేశారు. ఆదివారం నంది కొట్కూరులో నిరసన చేపట్టారు. వారు మాట్లాడుతూ.. ప్రజా నాట్య మండలి కళాకారులు తమ కుటుంబ సభ్యులతో కలిసివెళ్తుండగా, పట్ట పగలు నడి రోడ్డుపై డ్రగ్స్ ముఠా హత్య చేయడం దారుణమన్నారు. ముఠాను అరెస్టు చేయకపోతే ఆందోళన తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.