దానికి కిషన్ రెడ్డి సమాధానం చెప్పాలి: చామల

దానికి కిషన్ రెడ్డి సమాధానం చెప్పాలి: చామల

TG: కేంద్రమంత్రి కిషన్ రెడ్డి వ్యాఖ్యలపై ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. మంచి జరుగుతుంటే బీజేపీ నేతలు ఓర్వలేకపోతున్నారని విమర్శించారు. నిధులపై కిషన్ రెడ్డి చెప్పేవి దొంగ లెక్కలు అని ఆరోపించారు. ఏ శాఖకు ఎన్ని నిధులు ఇచ్చారో లెక్కలు చెప్పాలని డిమాండ్ చేశారు. గత BRS పాలనలో జరిగిన తప్పుల గురించి ఎందుకు మాట్లాడలేదో కిషన్ రెడ్డి సమాధానం చెప్పాలన్నారు.