స్వామివారికి ప్రత్యేక పూజలు

MDK: నర్సాపూర్ బస్ స్టాండ్ సమీపంలోని శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయంలో శనివారం స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వివిధ రకాల పూలతో స్వామివారిని అలంకరించారు. అనంతరం ఆలయ అర్చకులు స్వామివారికి నైవేద్యం సమర్పించారు. ఈ పూజా కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందారు.