డక్కిలిలో సచివాలయాలను తనిఖీ చేసిన కలెక్టర్
TPT: డక్కిలి మండలం నాగోలు, చాపలపల్లి సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలను జిల్లా కలెక్టర్ డా. ఎస్.వెంకటేశ్వర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. మ్యుటేషన్, 22ఏ, రీ-సర్వే, PGRS, IVRSపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సిబ్బందిని ఆదేశించారు. నిర్లక్ష్యం వహిస్తే వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ట్రైనీ కలెక్టర్ సందీప్ రఘు వాన్సీ, శ్రీకాళహస్తి ఆర్డీవో బానుప్రకాష్ రెడ్డి పాల్గొన్నారు.