VIDEO: జిల్లాలో భారీ వర్షం

అల్లూరి: జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో పలు చోట్ల ఆదివారం భారీ వర్షం కురుస్తుంది. ఉదయం నుంచి ఎడతెరిపి లేని వర్షం కురవడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మరో వైపు ఈదురుగాలులు వీస్తుండడంతో మామిడికాయలు నేల రాలిపోయాయని రైతులు వాపోయారు. దేవీపట్నం, పెదబయలు, అరకులోయ, ముంచంగిపుట్లు మండలాలతో సహా మరికొన్ని ప్రాంతాల్లో వర్షం కురుస్తుంది.