సెంచరీ కొట్టిన 'మన శంక‌ర‌వ‌ర‌ప్ర‌సాద్ గారు'

సెంచరీ కొట్టిన 'మన శంక‌ర‌వ‌ర‌ప్ర‌సాద్ గారు'

మెగాస్టార్ చిరంజీవి, నయనతార జంటగా నటిస్తోన్న సినిమా 'మన శంక‌ర‌వ‌ర‌ప్ర‌సాద్ గారు'. ఈ చిత్రం నుంచి విడుదలైన రెండు పాటలు యూట్యూబ్‌లో దూసుకుపోతున్నాయి. 'మీసాల పిల్లా' పాట 80M వ్యూస్ సొంతం చేసుకుంది. ఇటీవలే విడుదలైన 'శశిరేఖ' పాట 20M వ్యూస్ దక్కించుకుంది. భీమ్స్ సంగీతం అందించిన ఈ ఆల్బమ్ ఇప్పటికే 100M వ్యూస్‌తో సూపర్ హిట్‌గా నిలిచింది.