VIDEO: రాజమండ్రిలో రహదారిపై అడ్డంగా పడిన చెట్టు
తూ.గో: రాజమండ్రి నగరంలోని ప్రధాన రహదారిలో శుక్రవారం ఉదయం గానుగ చెట్టు అడ్డంగా పడిపోయింది. తాడితోట నుంచి ఆర్టీసీ కాంప్లెక్స్‌కి దారిలో పడిన చెట్లు కొమ్మలు రోడ్లపై ఉండడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నిత్యం వేలాది వాహనాలు తిరిగే ప్రాంతం కావడంతో అధికారులు స్పందించి కొమ్మలను తొలగించాలని ప్రయాణికులు కోరుతున్నారు.