VIDEO: మానేరు వాగులో దూకి కానిస్టేబుల్ ఆత్మహత్య
SRCL: మానేరు వాగులో దూకి పోలీస్ కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకున్న ఘటన తంగళ్ళపల్లిలో శుక్రవారం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. తంగళ్ళపల్లికి చెందిన కానిస్టేబుల్ అభిలాష్ సిరిసిల్లలోని మానేరు వాగులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న పోలీసులు మృతదేహాన్ని బయటకు తీశారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.