ఆటో బోల్తా.. ప్రయాణికులకు గాయాలు
KMM: కల్లూరు మండలం ముగ్గు వెంకటాపురం ప్రాథమిక పాఠశాల సమీపంలో మంగళవారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఓ ఆటో ప్రమాదవశాత్తు బోల్తా పడగా ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. కుర్నవల్లి నుంచి ముత్తగూడెం వెళ్తుండగా కోతులు అకస్మాత్తుగా రోడ్డుపైకి రావడంతో ఈ ప్రమాదం జరిగింది. గ్రామంలో కోతుల బెడద తీవ్రంగా ఉందని, ఇబ్బందులు పడుతున్నట్లు స్థానికులు తెలిపారు.