ఆలయ రథోత్సవంలో ఉద్రిక్తత

తమిళనాడులోని పుదుకోట్టెలో ఉద్రిక్తత నెలకొంది. ఆలయ రథోత్సవంలో రెండు వర్గాల మధ్య ఘర్షణ తలెత్తింది. ఈ క్రమంలో పరస్పరం కత్తులతో దాడికి పాల్పడగా.. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించగా.. వారిలో 10 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఆ ఘర్షణలో ఆందోళనకారులు ఇళ్లు, వాహనాలకు నిప్పంటించటంతో వివాదం మరింత ముదిరింది.