నేడు జిల్లాలో ట్రాఫిక్ ఆంక్షలు

ATP: జిల్లాలో ఆదివారం మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సోమవారం ఉదయం 7 గంటల వరకు వినాయక నిమజ్జనం కారణంగా ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని అర్బన్ డీఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు. భారీ వాహనాలు టౌన్‌లోకి రాకుండా తపోవనం సర్కిల్, రుద్రంపేట సర్వీసు రోడ్డు, పంగల్ రోడ్డు, చెరువుకట్ట, ఎన్టీఆర్ మార్గ్ వంటి ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా ప్రయాణించాలని సూచించారు.