'ఈ-కేవైసీ వేగం పెంచండి'
VSP: జిల్లాలో రీసర్వే పూర్తైన గ్రామాల్లో పట్టాదారు పాసు పుస్తకాల జారీని వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ ఎం. అభిషిక్త్ కిశోర్ అధికారులకు ఆదేశించారు. ఈ మేరకు గురువారం సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ-కేవైసీ ప్రక్రియను త్వరగా పూర్తి చేసి, సాంకేతిక సమస్యలను పరిష్కరించాలని సూచించారు. నిర్దేశిత గడువులో పనులు పూర్తి చేయాలని హెచ్చరించారు.