వైసీపీ నేత పాడె మోసిన చెవిరెడ్డి

వైసీపీ నేత పాడె మోసిన చెవిరెడ్డి

TPT: చంద్రగిరి నియోజకవర్గానికి చెందిన వైసీపీ యువ నాయకుడు తుంటి లీలాయాదవ్ ఆకస్మిక మృతిపై పార్టీ నేతలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ మాజీ విప్‌ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆయన నివాసానికి చేరుకుని మృతదేహానికి నివాళులర్పించారు. లీలాయాదవ్ కుటుంబ సభ్యులను ఓదార్చి ధైర్యం చెప్పారు. అనంతరం జరిగిన అంతిమ యాత్రలో కొంతదూరం పాడె మోశారు.