'స్వచ్ఛతకు ప్రజల భాగస్వామ్యం కీలకం'

GNTR: ప్రతి నెల మూడవ శనివారం నిర్వహించే స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా, చిలకలూరిపేటలో శనివారం మాజీ మంత్రి పుల్లారావు పాల్గొన్నారు. ప్రజల్లో అవగాహన పెంచి స్వచ్ఛతలో భాగస్వామ్యమవ్వాలని పిలుపునిచ్చారు. పట్టణంలో 15వ ర్యాంకు సాధించినందుకు సిబ్బందికి అభినందనలు తెలిపారు. డంపింగ్ యార్డులను పార్కులుగా మార్చే ప్రణాళికను ఆయన వివరించారు.