శ్రీఇందు మృతి కేసు.. ఇద్దరు ఉపాధ్యాయులు సస్పెండ్

శ్రీఇందు మృతి కేసు.. ఇద్దరు ఉపాధ్యాయులు సస్పెండ్

MNCL: చెన్నూరులో 7వ తరగతి విద్యార్ధిని శ్రీఇందు ఆత్మహత్య సంఘటనపై కాళేశ్వరం జోనల్ అధికారి సీహెచ్ గిరిజ, జిల్లా సమన్వయ అధికారి రామ కళ్యాణి, పాఠశాల సిబ్బంది, విద్యార్థినిలతో విచారణ నిర్వహించారు. వాటర్ బాటిల్‌లో టర్పెంటాయిల్ తెచ్చుకొని తాగినట్లు విచారణలో తేలిందన్నారు. ఈ మేరకు విద్యార్థిని విషయంలో నిర్లక్ష్యం వహించిన ఇద్దరు ఉపాధ్యాయులను సస్పెండ్ చేసినట్లు వారు తెలిపారు.