రాజేష్ మృతిపై ఇంటెలిజెన్స్ డీజీకి ఫిర్యాదు
SRPT: కోదాడ పట్టణానికి చెందిన దళిత (మాదిగ) వ్యక్తి కర్ల రాజేష్ హత్యకు కారకులైన చిలుకూరు ఎస్సై సురేష్ రెడ్డి, కోదాడ రూరల్ పోలీసులు, ఇతర సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని,ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ కోరారు. గురువారం సాయంత్రం హైదరాబాదులో తెలంగాణ డీజీ (ఇంటెలిజెన్స్) విజయ్ కుమార్‌కు ఫిర్యాదు చేశారు.