తెలుగు గంగ కాలువలో దూకి విద్యార్థి ఆత్మహత్య

NLR: రాపూరు మండలంలోని వెలుగోను వద్ద తెలుగు గంగ కాలువలో శుక్రవారం రాత్రి ఇంటర్ విద్యార్థి గణేష్ (17) మృతదేహం లభించింది. ఎస్సై వెంకట రాజేశ్ కథనం మేరకు.. రాపూరు మండలంలోని వెలుగోను గ్రామానికి చెందిన మధుసూదన్ రెడ్డి చిన్న కుమారుడు గణేష్ రెడ్డి(17) నెల్లూరులోని ఓ ప్రైవేట్ కాలేజీలో చదువుతున్నాడని తెలిపారు.