'చేనేత కార్మికుల రుణమాఫీ హామీ అమలు చేయాలి'

'చేనేత కార్మికుల రుణమాఫీ హామీ అమలు చేయాలి'

BHNG: సంస్థాన్ నారాయణపురం మండలంలోని చేనేత పరిశ్రమల అభివృద్ధి, కార్మికుల సమస్యల పరిష్కారం, ఎన్నికల హామీల అమలు చేయాలని చేనేత కార్మిక సంఘం జిల్లా నాయకుడు మారయ్య ప్రభుత్వాన్ని కోరారు. ఈ సందర్భంగా డిప్యూటీ తహసీల్దార్ మమతకు వినతి పత్రం అందజేశారు. చేనేత కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.