రామప్పకు పెరిగిన భక్తుల తాకిడి

MLG: వెంకటాపురం మండలం పాలంపేటలోని యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప ఆలయానికి వేసవి సెలవులు కావడంతో సోమవారం భక్తుల తాకిడి పెరిగింది. రామలింగేశ్వర స్వామికి భక్తులు, పర్యాటకులు అభిషేక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ఉమా శంకర్ భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు.