దొంగతనాలకు పాల్పడిన వ్యక్తి అరెస్ట్

దొంగతనాలకు పాల్పడిన వ్యక్తి అరెస్ట్

BDK: వరుస దొంగతనాలకు పాల్పడిన వ్యక్తిని బుధవారం అదుపులోకి తీసుకున్నామని కొత్తగూడెం డీఎస్పీ ఆదినారాయణ వివరాలు వెల్లడించారు. మడివి భద్రయ్య అనే వ్యక్తి ధన్‌బాద్ పోచమ్మ గుడిలో హుండీ పగలగొట్టి రూ. 300 దొంగిలించాడు. అలాగే చిట్టిరామవరం - వనందాసు గడ్డ మధ్యగల భూక్యా లావణ్య కిరణా షాపులో కొన్ని మద్యం బాటిళ్లు, రూ. 4వేల నగదు దొంగిలించినట్లు అంగీకరించాడని అన్నారు.