విద్యార్థులతో భోజనం చేసిన ఎమ్మెల్యే
VZM: బొబ్బిలి ఎమ్మెల్యే బేబినాయన ఇవాళ బాడంగి ZP పాఠశాలలో జరిగిన PTM ఆత్మీయ సమావేశంలో పాల్గొన్నారు. విద్యార్థులు పాఠశాల దశ నుంచే క్రమశిక్షణ అలవర్చుకోవాలని ఈ సందర్భంగా సూచించారు. తల్లిదండ్రులు పిల్లలపై ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు. ఈ కార్యక్రమంలో విద్యార్థిని విద్యార్థులుతో కలిసి మధ్యాహ్న సహపంక్తి భోజనం చేశారు.