నేడే స్టీల్ ప్లాంట్‌కు శంకుస్థాపన
AP: అనకాపల్లిలో అర్సెలర్ మిట్టల్, నిప్పన్ స్టీల్ సంయుక్తంగా నిర్మించనున్న మెగా స్టీల్ ప్లాంట్‌కు సీఎం చంద్రబాబు ఇవాళ శంకుస్థాపన చేయనున్నారు. కేంద్రమంత్రి H.D కుమారస్వామి ఈ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. రూ.60 వేల కోట్ల భారీ పెట్టుబడితో ఏర్పాటుకానున్న ఈ ప్లాంట్ ద్వారా 20 వేల మందికి ప్రత్యక్షంగా ఉపాధి లభిస్తుందని ప్రభుత్వం ఇదివరకే తెలిపింది.