రేపు NTR విగ్రహానికి నివాళులర్పించనున్న సీఎం

రేపు NTR విగ్రహానికి నివాళులర్పించనున్న సీఎం

GNTR: రాష్ట్ర సచివాలయంలో గురువారం ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు వెంకటపాలెంలోని ఎన్టీఆర్‌ విగ్రహానికి నివాళులర్పించనున్నారు. ఉదయం 8 గంటలకు పూలమాలలు వేసి, ఆయన నివాళులు అర్పిస్తారని తాడికొండ నియోజకవర్గ టీడీపీ కార్యాలయం తెలిపింది. అనంతరం అక్కడి నుంచి అసెంబ్లీకి బయలుదేరతారన్నారు.