మౌంట్ కానామోను అధిరోహించిన జిల్లా వాసి

మౌంట్ కానామోను అధిరోహించిన జిల్లా వాసి

ASF: దేశ 79వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా జిల్లా వాసి అరుదైన ఘనత సాధించాడు. హిమాచల్ ప్రదేశ్‌లోని స్పిటీ వ్యాలీలో ఉన్న మౌంట్ కానామో (6,001 మీటర్లు) శిఖరాన్ని కెరామెరి మండలం కేలి(కె)కు చెందిన పర్వతారోహకుడు జిట్టే కార్తీక్, అతడి బృందం అధిరోహించారు. ఈ సందర్భంగా కార్తీక్ బృందాన్ని స్థానిక ఎమ్మెల్యే కోవా లక్ష్మి అభినందించారు.