VIDEO: గురుకుల విద్యార్థిని ఆత్మహత్యాయత్నం

ప్రకాశం: కంభంలోని గురుకుల పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న సృజన ఆత్మహత్యయత్నం చేసుకుంది. గురువారం పాఠశాల బాత్రూంలోకి వెళ్లి లైజాల్ తాగింది. ఇవాళ ఉదయం స్టడీ అవర్స్‌లో ప్రాజెక్ట్ వర్క్ విషయంలో బయాలజీ టీచర్ అందరి ముందు కొట్టడం వల్ల మనస్థాపం చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. బాలికను కంభం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి అనంతరం మార్కాపురానికి తరలించినట్లు పేర్కొన్నారు.