హెల్పర్లకు ప్రమోషన్ కల్పించాలని నిరసన
SRCL: చందుర్తి మండలంలోని వివిధ గ్రామాలల్లో సెస్ పరిధిలో పనిచేస్తున్న అసిస్టెంట్ హెల్పర్లు ప్రమోషన్ కల్పించాలని నల్ల బ్యాడ్జీలతో బుధవారం నిరసన తెలిపారు. విధుల్లో భాగంగా మధ్యాహ్నం సమయంలో సెస్ కార్యాలయం ఎదుట నిసన వ్యక్తం చేశారు. చాలీచాలని వేతనాలతో విధులు నిర్వహిస్తున్నామన్నారు. ఉన్నతాధికారులు స్పందించి హెల్పర్లుగా ప్రమోషన్ ఇవ్వాలన్నారు.