హాస్టల్ విద్యార్థులకు హెల్త్ చెకప్

BHNG: భువనగిరి మండలం పరిధిలో ఉన్న మహాత్మ జ్యోతిబా పూలే స్కూల్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ అనంతారం హాస్టల్, ఎస్టీ గిరిజన గ్రామీణ ఆశ్రమ పాఠశాల పగిడిపల్లి విద్యార్థులకు మండల వైద్యాధికారి డా. యామిని శృతి ఆధ్వర్యంలో హెల్త్ క్యాంపు నిర్వహించారు. వంటశాల, స్టోర్ రూమ్ పరిసరాలను పరిశీలించారు. వడదెబ్బ రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు వ్యక్తిగత పరిశుభ్రతపై అవగాహన కల్పించారు.