'ఆస్పత్రిలో స్కానింగ్ సౌకర్యం కల్పించాలి'

'ఆస్పత్రిలో స్కానింగ్ సౌకర్యం కల్పించాలి'

ప్రకాశం: గిద్దలూరు మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో సౌకర్యాలు సరిగాలేవని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా స్కానింగ్ సౌకర్యం అందుబాటులో లేదని వాపోయారు. స్కానింగ్ అవసరమైన ప్రతీసారీ రూ. 2000 వరకు ఖర్చవుతున్నాయన్నారు. అత్యవసర సమయంలో గర్భిణీలు, మహిళలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఉన్నతాధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.